ఎమ్మెల్యే ఇంటిపై దాడిని ఖండిస్తున్నాం
On
- మాదిగ జాగృతి సంఘం
విశ్వంభర, బషీర్ బాగ్ : తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యూల్ ను తీవ్ర పదజాలంతో దూషిస్తూ ఆయన నివాసంపై జరిగిన దాడి ఘటనలను మాదిగ జాగృతి సంఘం తరుపున ఖండిస్తున్నామని భీమ్ రావు, లింగ స్వామి అన్నారు. శుక్రవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాదిగ జాగృతి సంఘం నాయకులు భీమ్ రావు , లింగస్వామి లు మాట్లాడుతూ, ఒక అధికార పార్టీ దళిత ఎమ్మెల్యే కి ఇంత ఘోరమైన అవమానం జరుగుతుంటే ముఖ్యమంత్రి స్పందించకపోవడం చాలా దారుణం అని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి దాడి చేసిన వారిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మందుల శామ్యూల్ కు తగిన భద్రత కల్పించడంతో పాటు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో మల్లేష్, శివరాజ్, రవి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.



