హామీలను అమలు చేయాలి
విశ్వంభర, చౌటుప్పల్ : ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని బి ఆర్ ఎస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు బోయ బిక్షం అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను, స్థానిక ప్రజా సమస్యలను పరిష్కారించాలని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాడి 27 నెలలు గడుస్తున్నా, ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీ ల్లో ఏ ఒక్క హామీని కూడా అమలు చేయడంలేదని, మహాలక్ష్మి పథకం పేరుతో మహిళలకు నెలకు 2500 రూపాయలు, కళ్యాణలక్ష్మి తో పాటు తులం బంగారం, ఇంటర్ విద్యార్థినిలకీ స్కూటీ, రైతులకు రైతు భరోసా కింద సంవత్సరానికి 15000 రూపాయలు, నిరుపేదలకు ఇళ్ళ పట్టాలు, కొత్త పెన్షన్ మరియు పెన్షన్ రెండు వేల రూపాయలను నాలుగు వేలకు పెంచుతామని హామీలు ఇచ్చి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి హామీలను నెరవేర్చడంలో విఫలం చెందారని విమర్శించారు. రేవంత్ రెడ్డి కి పరిపాలన చేతకావడం లేదని వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టడం కాదు చేతనైతే అభివృద్ధి చేసి చూపించండి అని అన్నారు. ఇచ్చిన 420 హామీలు అమలు చేయడం లో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయంది అని ఇంత వరకు రైతులకు రైతు బంధు అందించలేదని విమర్శించారు.



