ఘనంగా వసంత పంచమి

ఘనంగా వసంత పంచమి

విశ్వంభర, ఆమనగల్లు: పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో సహృదయ ఫౌండేషన్ సభ్యులు వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు.సహృదయ ఫౌండేషన్ సభ్యులు  1991_1992 బ్యాచ్  10 వ తరగతి విద్యార్థులు కలిసి పాఠశాలకు సహృదయ ఫౌండేషన్ పేరు మీద 2018 సంవత్సరంలో రేకుల కప్పుతోని ఒక సభా వేదికను అలాగే సరస్వతీ మాత విగ్రహాన్ని సుమారుగా  2 లక్షల వరకు  వెచ్చించి స్కూల్లో  ఏర్పాటు చేశారు. ప్రతి వసంత పంచమికి స్కూలుకు వచ్చి సరస్వతీ మాత విగ్రహానికి పూజలు వేసి  విద్యార్థులకు స్వీట్లు ,పండ్లు పంచి పెడతారు. ఈ సందర్బంగా సహృదయ ఫౌండేషన్ అధ్యక్షుడు సంద వేణుగోపాల్ మాట్లాడుతూ , విద్యార్థులు మంచి అలవాట్లు మంచి నడవడిక కలిగి ఉండాలన్నారు. మంచిగా చదువుకుని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. ఎక్కడ ఉన్నా ఉన్న ఊరును మనం చదివిన స్కూలు మరవద్దు అని విద్యార్థులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంద రవి ప్రసాద్, చింతోజు రవి కిరణ్, ఏలే శివకుమార్, అవ్వారి పాండు, భావండ్ల శంకర్, గుర్రం కేశవులు, గోజే ఆనంద్, భావండ్ల నరసింహ, భావండ్ల రమేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Tags: