శ్రీరామ నవమి వేడుక పై సమావేశం
On
విశ్వంభర, మహబూబాబాద్: పర్వతగిరి గ్రామంలో శుక్రవారం శ్రీ రాముల వారి దేవాలయం ప్రాంగణంలో ఆలయ కమిటీ, పర్వతగిరి గ్రామ పెద్దల సమక్షంలో శ్రీరామనవమి వేడుకల పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, ఈనెల 27వ తేదీన జరగబోయే శ్రీరామనవమి వేడుకలు చాలా ఘనంగా నిర్వహిద్దామని , ప్రతి సంవత్సరం చాలా సంతోషంగా జరుపుకుంటున్నామని ఈ సంవత్సరం కూడా అలాగనే జరుపుకుందామని పేర్కొన్నారు. రాములవారి కళ్యాణం లో గ్రామస్తులందరూ తప్పకుండా పాల్గొనవలసిందిగా వారు కోరారు.



