పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ
విశ్వంభర, నిజామాబాద్: నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య మోపాల్ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లోని రికార్డుల నిర్వహణ, ఫిర్యాదుల పరిష్కారం, భద్రతా చర్యలు, సిబ్బంది పనితీరును సమీక్షించారు. కమిషనర్ పోలీస్ సిబ్బందికి ప్రజలతో మరింత స్నేహపూర్వకంగా వ్యవహరించాలని, ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. అలాగే శాంతి భద్రతలను కట్టుదిట్టంగా నిర్వహిస్తూ, ప్రజల విశ్వాసాన్ని పెంపొందించే విధంగా పని చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం ద్వారా పోలీస్ శాఖ పనితీరును మెరుగుపరచడం, ప్రజలకు మెరుగైన సేవలు అందించడం లక్ష్యంగా ఉందని తెలిపారు.పోలీస్ స్టేషన్ కు సంబంధించినటువంటి బొలెరో వాహనం మరియు పెట్రోలింగ్ వాహనంల పనితీరును క్షుణ్ణంగా తనకి నిర్వహించారు. పెట్రోలింగ్ వాహనంలో ఏర్పాటు చేసినటువంటి ఫస్ట్ ఎయిడ్ కిట్ సామాగ్రి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సంబంధిత సిబ్బందికి వాహనం కు సంబంధించినటువంటి ఎల్లప్పుడూ కండిషన్ లో ఉంచుకోవాలి అని తెలిపారు.



