విద్యార్థులకు సర్టిఫికెట్ల ప్రదానం   

విద్యార్థులకు సర్టిఫికెట్ల ప్రదానం   

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 9 నుండి మార్చి 4 వరకు "జీవన నైపుణ్యాలు, ఆశావాహ దృక్పథం" అనే అంశంపై నిర్వహించిన సర్టిఫికెట్ కోర్సును పూర్తి చేసుకున్న విద్యార్థులను ప్రిన్సిపాల్ డాక్టర్ రాహత్ ఖానం సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్ కొమ్ము నరేష్, రసాయన శాస్త్ర విభాగం అధిపతి ఎం.అనిత, వైస్-ప్రిన్సిపల్ డాక్టర్ పి.వెంకటేశ్వరరావు, అకాడమిక్ కో-ఆర్డినేటర్ డాక్టర్ జి.చిన్నబాబు, ఐక్యుఏసి కోఆర్డినేటర్ డాక్టర్ నీలిమ, డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య, డాక్టర్ రవీందర్, ఏవో జి.కరుణాకర్, డాక్టర్ బ్రహ్మం, డాక్టర్ వెంకట్ గౌడ్, డాక్టర్ కిషన్, డాక్టర్ రాచమల్ల శ్రీను, తాటిశెట్టి శ్రీను, నరేష్, అమర్, రాధిక, ఆంజనేయులు, బాలరాజు, రవి తదితరులు పాల్గొన్నారు.

Tags: