ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు
విశ్వంభర, ఘట్కేసర్: మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ సర్కిల్ పోచారం డివిజన్ నారపల్లిలో ని మజీద్ ఆవరణలో రంజాన్ మాసం సందర్బంగా బిఆర్ఎస్ యువ నాయకుడు సామల సందీప్ రెడ్డి ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.ఈ సందర్బంగా సందీప్ రెడ్డి మాట్లాడుతూ, ముస్లిం సోదరులు పవిత్ర రంజాన్ మాసంలో నెలరోజుల పాటు ఆచరించే ఉపవాసాల అనంతరం నిర్వహించే ఇఫ్తార్ విందు మతసామరస్యానికి ప్రతీక అని అన్నారు. ముస్లిం సోదరుల కోసం ఈ కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉంది అన్నారు. ఈ మేరకు సుమారు 1500 వందల మంది ముస్లిం సోదరులతో కలిసి ఉపవాస విరమణ చేసి వారికి ఖర్జుర పండ్లు తినిపించారు.వారికి ముదస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా మజీద్ పెద్దలు పలువురు సందీప్ రెడ్డి ని శాలువాతో ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.



