ఆలేరులో ముస్లింలకు ఇఫ్తార్ విందు
On
విశ్వంభర,నెల్లికుదురు: మండలంలోని ఆలేరులో ముస్లింలకు ఆ గ్రామ సర్పంచ్ నాయిని పద్మ సత్యపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఇచ్చారు. అనంతరం రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచి మాట్లాడుతూ, ముస్లింలకు అన్ని విధాలుగా ప్రభుత్వం సహకారం అందిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గన్న హరీష్, గ్రామ వార్డు సభ్యులు పోతరాజు నరేష్, వాలేరు శైలజ, అమంద సుగుణమ్మ, డోనికేని భాగ్యలక్ష్మి, కాంపటి భవాని, ఎంకె వీరన్న, షేక్ అక్తర్, ఏడెల్లి వెంకటమల్లు,మల్లేష్, మైనార్టీ నాయకులు గౌస్,దేవాలయ కమిటీ చైర్మన్ లు ఏరె కృష్ణ, భూపతి సుధాకర్, ఏఎంసీ డైరెక్టర్ మల్లేశం తదితరులు పాల్గొన్నారు.



