సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన
On
విశ్వంభర, పరిగి: పూడూరు మండల పరిధిలోని రాకంచెర్ల గ్రామంలో సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించడం జరుగుతుందని తెలిపారు. గ్రామ అభివృద్ధిలో ప్రజలంతా భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. దశలవారీగా గ్రామంలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ కమ్లి బాయ్ పెంటయ్య, డిసిసి కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి,కాంగ్రెస్ సీనియర్ నాయకులు రఘునాథ్ రెడ్డి, ఉప సర్పంచ్ సాయన్న, నాయకులు గోపాల్, పరమేష్, తదితరులు పాల్గొన్నారు.



