ఘనంగా ఉగాది సంబరాలు 

ఘనంగా ఉగాది సంబరాలు 

విశ్వంభర, మహబూబాబాద్: జిల్లా కేంద్రంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో విద్యార్థులు, అధ్యాపక బృందంతో కలిసి స్కూల్ ప్రిన్సిపాల్ పూరం భూపాల్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ ప్రీతి రెడ్డి, డైరెక్టర్ ఆవుల శ్రీనివాస్  లు ఉగాది పండుగ ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్భంగా  ప్రిన్సిపాల్  భూపాల్ రెడ్డి మాట్లాడుతూ,  ఈ పండుగను పిల్లలతో కలిసి చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయమని అన్నారు . మన తెలుగు పండుగ ఉగాది అని ఈ పండుగ కి  చాలా ప్రాముఖ్యత ఉంది అని గుర్తు చేశారు. ప్రతి సంవత్సరం స్కూల్లోనే   ఉగాది పండుగను ఈ విధంగానే ఉగాది పచ్చడి తయారు చేసి విద్యార్థులందరికీ అందించి ఒక పండుగ వాతావరణం లాగా జరుపుకుంటామని అన్నారు. అనంతరం  అన్ని పండుగలు కూడా పాఠశాలలో జరుపుకొని ఆ పండుగ విశిష్టతను విద్యార్థులకు తెలియజేయడమే మా పాఠశాల  ప్రాముఖ్యత అని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమం లో డైరెక్టర్ ఆవుల శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపాల్ ప్రీతిరెడ్డి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని, విద్యార్థులు  పాల్గొన్నారు .

Tags: