ప్రకృతి వ్యవసాయంతోనే అధిక లాభాలు 

ప్రకృతి వ్యవసాయంతోనే అధిక లాభాలు 

  •  వ్యవసాయ అధికారి నిశాంత్ కుమార్ 

విశ్వంభర, షాద్ నగర్: రైతులు రసాయన ఎరువులను వీడి ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లడం ద్వారా తక్కువ ఖర్చుతో అధిక లాభాలను ఆర్జించవచ్చని మండల వ్యవసాయ అధికారి నిషాంత్ కుమార్ తెలిపారు. మంగళవారం ఫరూఖ్‌నగర్ మండలంలోని బూర్గుల రైతు వేదికలో కేంద్ర ప్రభుత్వ పథకమైన నేషనల్ మిషన్ ఫర్ నేచురల్ ఫార్మింగ్ కింద ఎంపికైన 125 మంది రైతులకు ప్రకృతి వ్యవసాయ కిట్లను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏఓ నిషాంత్ కుమార్ మాట్లాడుతూ.ప్రకృతి వ్యవసాయం వల్ల నేల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కిట్లలో జీవామృతం, ఘనజీవామృతం, బీజామృతం తయారీకి అవసరమైన పదార్థాలతో పాటు వాటి వినియోగంపై పూర్తి స్థాయి సూచనలు ఉన్నాయని తెలిపారు. రైతులకు ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, సాంకేతిక మెళకువలు, ప్రభుత్వ రాయితీలపై అవగాహన కల్పించారు. పెట్టుబడి లేని వ్యవసాయానికి అవసరమైన ద్రావణాల తయారీకి ఈ కిట్లు ఉపయోగపడతాయన్నారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు రాంబాబు, తేజ్ కుమార్, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

Tags: