నీటి సమస్య తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు  -  డా.  కోడి శ్రీనివాసులు,  చైర్ పర్సన్ మున్సిపాలిటీ చండూరు 

 నీటి సమస్య తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు  -  డా.  కోడి శ్రీనివాసులు,  చైర్ పర్సన్ మున్సిపాలిటీ చండూరు 

విశ్వంభర, చండూరు: చండూరు మున్సిపాలిటీ పరిధిలో 6వ వార్డు, 3వ వార్డు మరియు 9 వార్డులలో నీటి సమస్య ఉన్నందున వేసవి కాలములో ప్రజలకు నీటి సమస్య రాకుండా కొత్త బోరులు వేయించడం జరిగింది. అందులో భాగంగా శుక్రవారం నాడు  కొత్త బోర్లను ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఇట్టి కార్యక్రమములో చండూరు మున్సిపాలిటీ  చైర్ పర్సన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, వైస్ చైర్ పర్సన్ భూతరాజు దశరథ, మున్సిపల్  కమీషనర్ ఎల్. మల్లేశం,  కౌన్సిల్ సభ్యులు శ్రీమతి తేలుకుంట్ల రాజకుమారి, బుషిపాక వాసు, సామ సుజాత, జెల్ల ధనమ్మ, కోన్రెడ్డి మధు, కోడి సుష్మవెంకన్న, కలిమికొండ పారిజాత, కటకం రమేష్ మరియు కల్లెట్ల  మారయ్య, పాల్గొనడం జరిగింది.

Tags: