ఐఎన్ టీఏసిహెచ్ ఎన్నికల్లో వేదకుమార్ గెలుపు
విశ్వంభర, హిమాయత్ నగర్: ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ (కళ) హ్యాండ్ కల్చరల్ హెరిటేజ్ (సాంస్కృతిక ) వారసత్వం ఐఎన్ టీఏసిహెచ్ (డెక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్) న్యూఢిల్లీ గవర్నగ్ ఎన్నికలలో రికార్డు స్థాయిలో 4వ సారి ఇంజనీర్ వేద కుమార్ తిరిగి ఎన్నికయ్యారు. ఆయన తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ ఇండియా స్మారక చిహ్నాలు చారిత్రక భవనాలు సాంసృతిక సహజ వారసత్వ ప్రదేశాల గుర్తింపు. సంరక్షణ, పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. ఆయన అనేక దేశాలను సందర్శించి చారిత్రక నగరాలు ప్రదేశాలు అధ్యాయనం చేశారు. అంతర్జాతీయ వారసత్వ సదస్సులు ఎన్నో వేడుకల్లో పాల్గొని భారతదేశం యొక్క వైవిధ్యభరితమైన సంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం _ హెరిటేజ్ విభాగంతో కలిసి ముడుమల మెగా లిథిక్ మొన్హెర్స్ ను యునెస్కో ప్రపంచ వారసత్వ తాత్కాలిక జాబితా లో చేర్చడం లో కీలక పాత్ర పోషించారు. ఈ చర్య ద్వారా ఆ ప్రాచీన వారసత్వ స్థలానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది.



