విత్తన మేళాను సద్వినియోగం చేసుకోవాలి
విశ్వంభర, ఇనుగుర్తి: విత్తనమేళాను సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ సంచాలకులు అజ్మీర శ్రీనివాసరావు రైతులకు సూచించారు. మండల కేంద్రం ఇనుగుర్తి రైతు వేదికలో నిర్వహిస్తున్న విత్తనమేళాను ఏ డి ఏ శ్రీనివాసరావు గురువారం విజిట్ చేశారు. విత్తనాల విక్రయాలు ఎలా సాగుతున్నాయని అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 7 రకాలకు చెందిన సన్న వడ్ల విత్తనాలను సంబంధిత మేళాలో రైతుల కోసం ఉంచామని, ఈ రకాలకు చెందిన విత్తనాలను సాగు చేసుకుంటే ప్రభుత్వం బోనస్ ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి భూక్య మహేందర్ నాయక్, విస్తరణ అధికారి చందు పాల్గొన్నారు.