ఉద్యమ కళాకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి

విశ్వంభర, బాగ్‌లింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ఉద్యమ కళాకారుల సేవలను ప్రభుత్వం గుర్తించి వారి సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలంగాణ ఉద్యమకారులు భూపతి వెంకటేశ్వర్లు, ప్రపూల్ రాంరెడ్డి, సుల్తాన్ యాదగిరి, విష్ణు కిషోర్ డిమాండ్ చేశారు.హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుడు, సకల కళల జేఏసీ అధ్యక్షుడు మురళీధర్ దేశ్‌పాండే సంస్మరణ సభలో వారు మాట్లాడారు. తెలంగాణ ఉద్యమానికి సాంస్కృతిక బలాన్ని అందించడంలో దేశ్‌పాండే కీలక పాత్ర పోషించారని కొనియాడారు. కళాకారులకు గుర్తింపు కార్డులు, నెలవారీ పింఛన్లు, ప్రత్యేక సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే మురళీధర్ దేశ్‌పాండే కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి, కుటుంబ సభ్యుడికి ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. అనంతరం దేశ్‌పాండే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పలువురు ఉద్యమకారులు, కళాకారులు, దేశ్‌పాండే కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

🕒 26 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/special-measures-should-be-taken-for-the-welfare-of-movement/article-17230

Tags: