గ్రామీణ బ్యాంక్ ఉద్యోగుల ధర్నా

గ్రామీణ బ్యాంక్ ఉద్యోగుల ధర్నా

  • గ్రామీణ బ్యాంక్ ఉద్యోగుల ధర్నా

విశ్వంభర, హైదరాబాదు : గ్రామీణ బ్యాంక్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఆల్ ఇండియా రీజినల్ రూరల్ బ్యాంక్ ఎంప్లాయూస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు హైదరాబాదు నల్లకుంటలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు పదోన్నతులకు అవసరమైన సేవా కాలాన్ని తగ్గించి, ఉన్నత స్థాయి కేడర్ పోస్టులు సృష్టించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించడంతో పాటు సర్వీస్ నిబంధనలను పరిశ్రమ ప్రమాణాలకు అనుగుణంగా సవరించాలన్నారు. డైలీ వేజ్డ్, క్యాజువల్ కార్మికుల సేవల క్రమబద్ధీకరణకు ప్రత్యేక పథకం అమలు చేయాలని కోరారు. పనితీరు ఆధారిత ప్రోత్సాహకం అమలు, బదిలీ విధానాన్ని పరిశ్రమ ప్రమాణాలకు అనుగుణంగా మార్చాలని, అన్ని కేడర్లలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని తెలిపారు. ప్రమోషన్ కేడర్లలో పనిచేస్తున్న డిప్యూటేషన్ అధికారులను తిరిగి పంపించి, వేతనాలు, అలవెన్సుల్లో సమానత్వం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పి. వేణు రావు, కె. అశోఖ్ రెడ్డి, ఎ. బాబులు, శంకరయ్య, రాజా రావు తదితరులు పాల్గొన్నారు.

Tags: