ఉపాధి హామీ పనులు సద్వినియోగం చేసుకోవాలి
On
- ఎంపీడీవో క్రాంతి కుమార్
విశ్వంభర , పెద్ద శంకరంపేట: గ్రామాలలో ఉపాధి హామీ పనులను ఉపాధి హామీ కూలీలు సద్వినియోగం చేసుకోవాలని పెద్ద శంకరంపేట ఎంపీడీవో క్రాంతి కుమార్ అన్నారు. బుధవారం పెద్ద శంకరంపేట మండల పరిధిలోని మల్కాపూర్ గట్టు కింది తాండ గ్రామాలలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీలతో మాట్లాడుతూ మెసేజ్ కాలం దృష్టిలో ఉంచుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఆయా గ్రామాల పరిధిలోని నర్సరీలను వారు పరిశీలించారు.. ఈ కార్యక్రమంలో ఈజిఎస్ ఏపీవో సంతోష్ కుమార్. ఈసీ నవాజుద్దీన్. పంచాయతీ కార్యదర్శి స్వప్న. ఫీల్డ్ అసిస్టెంట్ నరసింహులు తదితరులు పాల్గొన్నారు.



