మద్దతు ధరతోనే రైతుకు ఆర్థిక భరోసా
విశ్వంభర, కేసముద్రం: రైతులు ఆర్థికంగా బలోపేతం కావాలనే లక్ష్యంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని కేసముద్రం సింగిల్ విండో చైర్మన్ దికొండ వెంకన్న అన్నారు. గురువారం కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని విలేజ్ కేసముద్రం సొసైటీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని చైర్మన్ దికొండ వెంకన్న, తహశీల్దార్ వివేక్ తో కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగా వెంకన్న మాట్లాడుతూ గ్రామాల్లోనే కేంద్రాలు ఉండటం వల్ల రైతులకు రవాణాభారం తగ్గుతుందన్నారు. అధికారులు ఎక్కడా అవకతవకలకు తావులేకుండా పారదర్శకంగా కొనుగోళ్లు జరిపి,సకాలంలో చెల్లింపులు అయ్యేలా చూడాలని ఆదేశించారు. నాణ్యతా ప్రమాణాల మేరకు ధాన్యాన్ని ఎండబెట్టి కేంద్రాలకు తీసుకురావాలని కోరారు. ప్రభుత్వ నిబంధనలు ప్రకారం ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ధాన్యం విక్రయానికి తెచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ రావుల వినయ్ రెడ్డి, సొసైటీ డైరెక్టర్స్ బీరం గోపాల్ రెడ్డి, తోట శోభా నాగన్న, గూగులోత్ రాంజీ నాయక్, మహేందర్ రెడ్డి, నంద, నూనావత్ శ్రీనివాస్, కాంగ్రెస్ జిల్లా నాయకులు కీర్తి సురేందర్, సీఈవో ఎల్లయ్య, సిబ్బంది రమేశ్, రాజు, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.