రామన్నపేట–అమ్మనబోలు రూట్లో ఆర్టీసీ బస్సును పునరుద్ధరించాలని రాస్తా రోకో  

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలంలోని రామన్నపేట మండల కేంద్రం నుండి అమ్మనబోలు రూట్లో ఆర్టీసీ బస్సును తక్షణమే పునరుద్ధరించి విద్యార్థుల రవాణా సమస్యను పరిష్కరించాలని కోరుతూ మండల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బుధవారం రాస్తారోకో నిర్వహించి విద్యార్థులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రామన్నపేట మండల కార్యదర్శి పుట్టల ఉదయ్ కుమార్ మాట్లాడుతూ, గత మూడు సంవత్సరాలుగా రామన్నపేట–అమ్మనబోలు రూట్లో ఆర్టీసీ బస్సు నడవకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ రూట్ పరిధిలోని 9 గ్రామాలకు చెందిన సుమారు 500 మంది విద్యార్థులు వివిధ విద్యా సంస్థల్లో చదువుకుంటున్నప్పటికీ, మండల కేంద్రానికి కనీస రవాణా సౌకర్యం లేక విద్యార్ధుల చదువుకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ, ఆర్టీసీ అధికారులకు పలు మార్లు వినతిపత్రాలు అందజేసినా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని అన్నారు. విద్యార్థుల సమస్యల పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని విమర్శించారు. ప్రతిరోజూ ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి రావడంతో ఒక్కో విద్యార్థి రోజుకు సుమారు రూ.100 వరకు ఖర్చు భరించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇది పేద, మధ్య తరగతి కుటుంబాలపై అదనపు ఆర్థిక భారంగా మారిందని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వెంటనే ఆర్టీసీ బస్సు సేవలను పునరుద్ధరించాలని, లేని పక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయం, ఆర్టీసి డీఎం ఆఫీస్ ముట్టడి కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యురాలు పెద్ది అక్షిత, మండల నాయకులు పిట్టల నవీన్, అప్పం అభిరూప్, బూడిద యశ్వంత్, ముక్కిడి ప్రవీణ్, తుర్కపల్లి లోకేష్, అభినవ్, శ్రావ్య, అనుప్రియ, హారిక తదితరులు పాల్గొన్నారు.

🕒 25 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/rasta-roko-to-restore-rtc-bus-on-ramannapet-ammanabolu-route/article-17135

Tags: