ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ

ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ

రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 23న సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ కీలక భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై మంత్రులు చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. 

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 23న సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ కీలక భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై మంత్రులు చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా త్వరలో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ, ప్రవేశపెట్టాల్సిన బిల్లులపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ
బడ్జెట్ సమావేశాలతో పాటు, రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న జీహెచ్ఎంసీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై కూడా కేబినెట్ ప్రత్యేకంగా చర్చించనుంది. ఈ ఎన్నికల షెడ్యూల్, అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రులు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Read More భద్రాద్రి రామయ్య లడ్డూ ప్రసాదంపై అభ్యంతరకర ప్రచారం. - సోషల్ మీడియా లో  వీడియో చక్కర్లు - పోలీసులకు ఫిర్యాదు చేసిన దేవస్థానం ఈవో

ఢిల్లీకి తెలంగాణ కేబినెట్ బాట
ఈ కేబినెట్ సమావేశానికి ముందు, తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. ఈ నెల 19వ తేదీన దేశ రాజధాని ఢిల్లీలో భారీస్థాయి సమావేశం జరగనుంది. ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్ వేదికగా జరిగే ఈ భేటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర కేబినెట్ మంత్రులందరూ హాజరుకానున్నారు. పార్టీ అధిష్టానంతో జరగబోయే ఈ సమావేశంలో రాష్ట్ర రాజకీయాలు, కీలక నిర్ణయాల గురించి చర్చించనున్నారు. ఢిల్లీ పర్యటన తర్వాత జరగబోయే కేబినెట్ భేటీలో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.