ప్రారంభోత్సవానికి సిద్దంగా ఉన్న వైశ్య రాజు జ్యువెలరీ షాప్, బిల్డింగ్ లో వాచ్ మెన్ ఆత్మహత్య

మృతిపై అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యుల ఆరోపణలు..

ప్రారంభోత్సవానికి  సిద్దంగా ఉన్న వైశ్య రాజు జ్యువెలరీ షాప్, బిల్డింగ్ లో వాచ్ మెన్ ఆత్మహత్య

విశ్వంభర, ఎల్బీనగర్ : చైతన్యపురి జాతీయ ప్రధాన రహదారి పై ఈ నెల 22 న ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న వైశ్యరాజు జ్యువెలరీ షాప్ బిల్డింగ్ లో వాచ్ మెన్ గా పనిచేస్తున్న శ్యామల ముత్తయ్య (40) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే చైతన్యపురి డివిజన్లోని  రామాలయం దగ్గర నివాసముండే శ్యామల ముత్తయ్య గత 20 సంవత్సరాల నుండి ఆ బిల్డింగ్ ఓనర్ వద్ద పనిచేస్తున్నాడు. మల్లికార్జున బార్ ఉండే స్థలంలోనే కొత్తగా బిల్డింగ్ నిర్మాణాన్ని చేపట్టి వైశ్యరాజు జ్యువెలరీ షాప్ కి కిరాయికి ఇచ్చారు. అప్పటినుండి ముత్తయ్య అక్కడ పనిచేస్తూ ఉన్నాడు. ముత్తయ్యకు భార్య కూతురు, కొడుకు ఉన్నాడు. భార్య 10 సంవత్సరాల క్రితమే మరణించింది. కూతురు వివాహం అయింది. కొడుకు ఆఫీస్ బాయ్ గా పని చేస్తున్నాడు. ఎలాంటి ఆర్థిక సమస్యలు లేవని, చనిపోయేంత బాధలు లేవని  కావాలని ఎవరో చంపేశారని కూతురు ఆరోపిస్తుంది. వాచ్ మెన్ మృతి పై  చాలా అనుమానాలు ఉన్నాయని, ఆ బిల్డింగ్ లో సీసీ కెమెరాలు కూడా పనిచేస్తలేవని చెప్తున్నారని అన్నారు. ఉదయం నాలుగు గంటలకే ఓ టి స్టాల్ వద్ద టీ తాగి వెళ్ళాడని అన్నారు.  మాకు న్యాయం చేయాలని వారు వేడుకుంటున్నారు.సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం  ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది