తెలంగాణ జాతి హీరో కేసీఆర్: కేటీఆర్

తెలంగాణ జాతి హీరో కేసీఆర్: కేటీఆర్

భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలు మంగళవారం తెలంగాణ భవన్‌లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాట్లాడుతూ.. తమ నాయకుడు కేసీఆర్ తెలంగాణ జాతికి హీరో అని స్పష్టం చేశారు. 

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలు మంగళవారం తెలంగాణ భవన్‌లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాట్లాడుతూ.. తమ నాయకుడు కేసీఆర్ తెలంగాణ జాతికి హీరో అని స్పష్టం చేశారు. కేసీఆర్ ఎప్పుడూ తాను "జాతిపిత"నని చెప్పుకోలేదని, తమ జాతికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన నేతను ప్రజలే అలా పిలుచుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ వేడుకల్లో కేటీఆర్‌తో పాటు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తదితర ముఖ్య నేతలు పాల్గొని 72 కిలోల కేక్ కట్ చేశారు. అలాగే కేసీఆర్ ఉద్యమ ప్రస్థానం, పదేళ్ల పాలనను ప్రతిబింబించే డాక్యుమెంటరీని నేతలు విడుదల చేశారు.

ద్రోహుల జాతి వర్సెస్ ఫైటర్ల జాతి
ఈ సందర్భంగా కేటీఆర్ ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉద్యమకారుల మీదకు తుపాకులు తీసుకొని దాడికి వెళ్లిన వారికి "జాతి" నిర్వచనం తెలియదని ఎద్దేవా చేశారు. తెలంగాణ జై నినాదానికి భయపడే వారికి, తెలంగాణ సోయి లేని వారికి జాతి విలువ తెలియదన్నారు. తెలంగాణలో కేవలం "తెలంగాణవాదుల జాతి", "తెలంగాణ ద్రోహుల జాతి" మాత్రమే ఉన్నాయని, తమది ఫైటర్ల జాతి అయితే, వారిది ద్రోహుల జాతి అని కేటీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు.

Read More ఎల్ ఓ సి అందజేత.

కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయడం అసాధ్యం
కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామని కొందరు అంటున్నారని, తెలంగాణ రాష్ట్రమే కేసీఆర్ ఆనవాళ్లు అయినప్పుడు వాటిని ఎలా చెరిపేస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాడిన వీరులు, విద్యార్థి అమరవీరుల జాతి తమదని ఆయన కొనియాడారు. కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రి చేయడమే కార్యకర్తలు జన్మదిన సందర్భంగా ఇచ్చే చిరుకానుక అని కేటీఆర్ పిలుపునిచ్చారు.