నిజామాబాద్‌లో హంగ్.. ప్రతిపక్షానికే బీజేపీ పరిమితం

నిజామాబాద్‌లో హంగ్.. ప్రతిపక్షానికే బీజేపీ పరిమితం

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు హంగ్‌కు దారితీయడంతో మేయర్ పీఠంపై ఉత్కంఠ నెలకొంది. అత్యధిక స్థానాలు సాధించినప్పటికీ, బీజేపీ ప్రతిపక్షానికే పరిమితమవుతామని సంచలన ప్రకటన చేయగా, అధికార కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం మద్దతుతో మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది.

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు హంగ్‌కు దారితీయడంతో మేయర్ పీఠంపై ఉత్కంఠ నెలకొంది. అత్యధిక స్థానాలు సాధించినప్పటికీ, బీజేపీ ప్రతిపక్షానికే పరిమితమవుతామని సంచలన ప్రకటన చేయగా, అధికార కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం మద్దతుతో మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది.

మొత్తం 60 డివిజన్లు ఉన్న నిజామాబాద్ కార్పొరేషన్‌లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ దక్కలేదు. బీజేపీ 28 స్థానాలు, కాంగ్రెస్ 17 స్థానాలు, ఎంఐఎం 14 స్థానాలు, ఇతరులు ఒక స్థానం గెలిచారు. కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ఎక్స్ అఫీషియో సభ్యుల (ఎమ్మెల్యే భూపతిరెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్) మద్దతుతో, ఎంఐఎంతో పొత్తు పెట్టుకుని మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే ఈ దిశగా కాంగ్రెస్ నాయకత్వం మంతనాలు ముమ్మరం చేసింది.

Read More ఘనంగా వినియోగదారుల చైతన్య సదస్సు

బీజేపీ నిర్ణయం: ప్రతిపక్షంలోనే
నిజామాబాద్‌లో తమకు స్పష్టమైన మెజారిటీ రాలేదని ఎంపీ ధర్మపురి అరవింద్ స్పష్టం చేశారు. తాము ప్రతిపక్షంలోనే ఉంటామని ఆయన తేల్చి చెప్పారు. అయితే, మేయర్ పదవీకాలం ముగిసేలోపు నిజామాబాద్ పేరును 'ఇందూరు'గా మార్చే ప్రయత్నం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇక ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై విశ్లేషణ చేస్తామని ఎంపీ అరవింద్ తెలిపారు. ఆర్మూర్ ప్రజలకు ఆయన క్షమాపణలు చెప్పారు.