వైభవంగా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కల్యాణం
విశ్వంబర, ఉప్పల్: వెంకట్ రెడ్డి నగర్ డివిజన్ శ్రీనివాసపురం కాలనీలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో శివరాత్రి సందర్భంగా శ్రీ మాతా గోవింద మాంబా సమేత శ్రీ పోతులూరివీరబ్రహ్మేంద్ర స్వామి, పార్వతి పరమేశ్వరుల కల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టు సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ రాష్ట్ర కోఆర్డినేటర్ కీర్తి సంతోష్ రాజ్ -వీణా దంపతులు,పెరికేటి సుధాకర్ చారి -లలిత దంపతులు,యాలాల వంశీధర్ -జాహ్నవి దంపతులు,చిట్టోజు బ్రహ్మచారి -ధనలక్ష్మీ దంపతులు కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీర్తి సంతోష్ రాజ్ మాట్లాడుతూ శివరాత్రి పర్వదినాన స్వామి కల్యాణ మహోత్సవంలో పాల్గొనడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు. అర్చక స్వాములు పత్తిపాక శాంతనాచార్యులు,పత్తిపాక శ్రీధరాచార్యుల ఆధ్వర్యంలో ఈ కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భైరోజు రామస్వామి చారి, యాలాల వెంకటేశం చారి, వేములవాడ నరసింహ చారి, కోర్ కమిటీ సభ్యులు,గౌరవ సలహా దారులు,శ్రీవిశ్వకర్మ సంఘం రామంతాపూర్ సభ్యులు భక్తులు పాల్గొన్నారు.



