అత్తాపూర్‌లో న్యాయవాది ఖదీర్ దారుణ హత్య

అత్తాపూర్‌లో న్యాయవాది ఖదీర్ దారుణ హత్య

రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ పరిధిలో దారుణ హత్య చోటుచేసుకుంది. న్యాయవాది ఖదీర్‌ను దుండగులు అత్యంత పాశవికంగా హత్య చేసి పరారయ్యారు. 

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ పరిధిలో దారుణ హత్య చోటుచేసుకుంది. న్యాయవాది ఖదీర్‌ను దుండగులు అత్యంత పాశవికంగా హత్య చేసి పరారయ్యారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. సులేమాన్‌ నగర్‌లోని తన కార్యాలయంలో న్యాయవాది ఖదీర్ ఉన్న సమయంలో దుండగులు ఆకస్మికంగా దాడి చేశారు. కత్తులతో ఆయనపై పలుమార్లు పొడవడంతో తీవ్ర రక్తస్రావమై ఖదీర్ అక్కడికక్కడే మృతి చెందారు. ఖదీర్ మరణించినట్లు నిర్ధారించుకున్న అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. కుటుంబ విభేదాల కారణంగా ఖదీర్ బావమరుదులే ఈ హత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనాస్థలిలో ఆధారాలను సేకరించారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Read More ఘనంగా విత్రీ న్యూస్ ఛానల్ క్యాలెండర్ ఆవిష్కరణ. - శుభాకాంక్షలు తెలిపిన పీసరి సురేందర్ రెడ్డి, పిసరి సతీష్ రెడ్డి.