వికారాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన మాజీ చైర్మన్ తనయుడు విశ్వనాథం రాఘవేందర్

వికారాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన మాజీ చైర్మన్ తనయుడు విశ్వనాథం రాఘవేందర్

వికారాబాద్, (విశ్వంభర): వికారాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో 23వ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన విశ్వనాథం రాఘవేందర్ విజయం సాధించారు. మాజీ చైర్మన్ విశ్వనాథం సత్యనారాయణ(సత్యం సేట్) తనయుడు రాఘవేందర్ ఈ విజయం సాధించడం విశేషం.రాఘవేందర్ గెలుపుతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుకుంది. వార్డు అభివృద్ధికి ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తామని రాఘవేందర్ తెలిపారు. తన తండ్రి మార్గదర్శకత్వంలో వార్డును అభివృద్ధి చేస్తానని ఆయన పేర్కొన్నారు. కౌన్సిలర్గా గెలుపొందిన రాఘవేందర్ గుప్తకి చేవెళ్ల నియోజకవర్గం ఆర్యవైశ్య సంఘం నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఉడుత శ్రీనివాస్ గుప్తా, ఉడుత కృష్ణ, రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య సంఘం నాయకులు యూత్ ఐకాన్ దండు రాహుల్ గుప్తా, పూర్ణచందర్ గుప్తా, రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షులు గడ్డం రమేష్ గుప్తా, ఆర్యవైశ్య సంఘం నాయకులు సీనియర్ పాత్రికేయులు ఉప్పు శ్రీనివాస గుప్తా, దండు రామ్మోహన్ గుప్తా, దండు రాము గుప్తా, దండు శంకర్ గుప్తా, బొంతపల్లి వీరయ్య గుప్త, బొంతపల్లి విద్యాసాగర్ గుప్తా, బొంతపల్లి వీరేశం గుప్తా, దేవేందర్ గుప్తా, నవీన్ గుప్తా ,రాకేష్ గుప్తా, యాచం చింటూ గుప్త, తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

Tags: