కుట్రలు చేస్తే కరీంనగర్ నుంచే యుద్ధం

కుట్రలు చేస్తే కరీంనగర్ నుంచే యుద్ధం

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో స్పందించారు.

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో స్పందించారు. ఈ విజయాన్ని రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగానికి అంకితం ఇస్తున్నానని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్‌లో బీజేపీకి కేవలం 13 సీట్లే వస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇంటెలిజెన్స్ వర్గాలు తప్పుడు నివేదిక ఇచ్చాయని బండి సంజయ్ ఆరోపించారు. సీఎం ఇకనైనా కళ్లు తెరవాలని హితవు పలికారు.

కరీంనగర్‌లో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఒక్కటై చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నాయని బండి సంజయ్ ధ్వజమెత్తారు. కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీదేనని స్పష్టం చేశారు. మేయర్ పీఠం దక్కించుకోవడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ కుట్రలు చేస్తే కరీంనగర్ నుంచే యుద్ధం మొదలుపెడతానని హెచ్చరించారు. బీజేపీ సింహం లాంటిదని, సింగిల్ గానే పోటీ చేసి గెలుస్తుందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కుమ్మక్కయ్యాయని బండి సంజయ్ ఆరోపించారు. ఈ మూడు పార్టీలకు వాలంటైన్స్ డే శుభాకాంక్షలు చెబుతున్నానని సెటైర్లు వేశారు. కరీంనగర్‌లో మేయర్ పీఠం కోసం గుంట నక్కలన్నీ ఒక్కటయ్యాయని ఘాటుగా విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల బండారం కరీంనగర్ వేదికగా బయటపడుతోందని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు.

Read More జీఎస్టీ సంస్కరణలు – దేశంలో విప్లవాత్మక మార్పుకు నాంది. – ఎం. వెంకయ్య నాయుడు