ప్రజలకు  అందుబాటులో రుద్ర ఫౌండేషన్ 

ప్రజలకు  అందుబాటులో రుద్ర ఫౌండేషన్ 

విశ్వంభర, చింతపల్లి :  రుద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో భవిష్యత్తులో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్టు ఆ ఫౌండేషన్ వ్యవస్థాపకులు యాచారం శివ వాత్సల్య తెలిపారు. మండల పరిధిలోని వింజమూరు గ్రామంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ  వింజమూరు గ్రామంలో నీటి ఎద్దడి నివారించడానికి సొంత ఖర్చులతో బోరు మోటారుతో వాటర్ ఫిల్టర్ ను త్వరలో ఏర్పాటు చేస్తానన్నారు. తాను జన్మించిన గ్రామ అభివృద్ధి ధ్యేయంగా  పనిచేస్తానని అన్నారు.  రుద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు, యువకులకు, గ్రామ ప్రజలకు వివిధ రూపాలలో  సహాయ సహకారాలు అందిస్తానన్నారు. ఇప్పటికే వివిధ సేవ కార్యక్రమాలు చేపట్టామని, భవిష్యత్తులో మరిన్ని ప్రజాప్రయోజన కార్యక్రమాలు చేపడతామని ఆయన తెలిపారు.

Tags:  

Advertisement

LatestNews