భద్రాద్రి రామయ్య లడ్డూ ప్రసాదంపై అభ్యంతరకర ప్రచారం. - సోషల్ మీడియా లో  వీడియో చక్కర్లు - పోలీసులకు ఫిర్యాదు చేసిన దేవస్థానం ఈవో

భద్రాద్రి రామయ్య లడ్డూ ప్రసాదంపై   అభ్యంతరకర ప్రచారం. -     సోషల్ మీడియా లో  వీడియో చక్కర్లు - పోలీసులకు ఫిర్యాదు చేసిన దేవస్థానం ఈవో

విశ్వంభర, భద్రాచలం:-  భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో తయారుచేసే  భద్రాద్రి రామయ్య లడ్డూ ప్రసాదంపై సోషల్ మీడియా లో అభ్యంతరకర ప్రచారం చేస్తున్నారని దేవస్థానం అధికారులు సోమవారం భద్రాచలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రామయ్య లడ్డూ ప్రసాదంలో పురుగు బతికి ఉన్నట్టుగా చూపుతూ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఓ వీడియోను దేవస్థానం అధికారులు, సిబ్బంది గుర్తించారు. ఈ విషయంపై ఈవో దామోదర్రావు.. భద్రాచలం సీఐ నాగరాజును కలిసి ఫిర్యాదు చేశారు. ఇందుకు కారకులను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా అధ్యయన ఉత్సవాలు వైభవంగా జరుగుతున్న సమయంలో ఇలాం టి అవాస్తవ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోల్చేసి దేవస్థానం ప్రతి ష్టను దెబ్బతీసేలా వ్యవహరించడాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని ఈవో ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆలయ ప్రతిష్టకు భంగం వాటిల్లేలా ఉద్దేశపూర్వకం గా వీడియో పోస్టుచేసిన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు.

Tags: