బైరామాల్ గూడ ఫ్లైఓవర్ కి మహాత్మ జ్యోతిబాపూలే పేరు పెట్టాలి.

తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎల్బీనగర్ నియోజకవర్గ ఇంచార్జ్, రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి బొంగు వెంకటేష్ గౌడ్

బైరామాల్ గూడ ఫ్లైఓవర్ కి మహాత్మ జ్యోతిబాపూలే పేరు పెట్టాలి.

విశ్వంభర,ఎల్బీనగర్ : సాగర్ రింగ్ రోడ్డు లోని బైరామల్ గూడ ప్లై ఓవర్ కు మహాత్మా జ్యోతిరావు ఫూలే  పెట్టాలని  తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎల్బీనగర్ నియోజకవర్గం ఇంచార్జ్, రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి బొంగు వెంకటేష్ గౌడ్ డిమాండ్ చేశారు.  ఎల్బీనగర్ లోని జ్యోతి భాపూలే విగ్రహం నుండి బైరామల్ గూడ చౌరస్తా వరకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులూ పాదయాత్ర చేశారు. అనంతరం బైరామల్ గూడ ఫ్లై ఓవర్ వద్ద ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిబా ఫూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా నిర్మాణాలకు పేర్లు నిర్ణయించే విషయంలో వ్యక్తిగత ప్రయోజనాలు కాకుండా సమాజానికి సేవచేసిన మహనీయుల సేవలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాభవన్‌కు మహాత్మా జ్యోతిరావు పూలే పేరు పెట్టిన విషయాన్ని గుర్తుచేస్తూ, ఎల్బీనగర్ ప్రాంతంలో వెనుకబడిన వర్గాల ప్రజలు అధికంగా ఉన్నందున బైరామాల్ గూడ పైవంతెనకు కూడా పూలే పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఏ లాంటి త్యాగం లేకుండా కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం పేర్లు ప్రతిపాదించడం సముచితం కాదని హితవు పలికారు. బిజెపి, బిఆర్ఎస్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కావడం వలన  బైరామల్  గూడ ఫ్లైఓవర్ కి  దివంగత వంగ మధుసూదన్ రెడ్డి పేరు పెట్టడానికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి లు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఎల్బీనగర్ నియోజక వర్గములో బీసీ సామజిక వర్గాన్ని అణచి చేయాలని కుట్రలు పన్నుతున్నారని  అలాంటి ధోరణి మంచిది కాదని హితవు పలికారు.ఎల్బీనగర్ ఉద్యమాల పురిటి గడ్డ అని అందుకే  కుల వివక్షకు, అంటరానితనానికి వ్యతిరేకంగా , వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి జీవితాన్ని అంకితం  చేసిన మహాత్మ జ్యోతిబాపూలే పేరును బైరామాల్ గూడ ఫ్లైఓవర్ కి నామకరణం చేయడం జరిగిందన్నారు . ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్,జిల్లా ఇంచార్జ్  సుదగాని హరిశంకర్, యువజన విభాగం అధ్యక్షుడు బొడ్డుపల్లి చంద్రశేఖర్, హైదరాబాద్ బాధ్యులు బావన, మేడ్చల్–మల్కాజిగిరి యువజన విభాగం అధ్యక్షుడు, రంగారెడ్డి జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు పాకాల నరసింహ, సింగం అరుణ్, ఎన్‌టీఆర్ నగర్ విభాగం అధ్యక్షుడు సంపత్ ప్రసాద్, కొత్తపేట విభాగం అధ్యక్షుడు స్వామి ముదిరాజ్, నారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు