కాంగ్రెస్ పార్టీకి బూత్  లెవెల్ ఏజెంట్లే వెన్నెముక

  1. ఎమ్మెల్యే డా.మురళి నాయక్

విశ్వంభర, ఇనుగుర్తి: కాంగ్రెస్ పార్టీకి బూత్ లెవెల్ ఏజెంట్లు వెన్నెముక లాంటి వారిని ఎమ్మెల్యే డా.భూక్య మురళి నాయక్ అన్నారు. మండల కేంద్రం ఇనుగుర్తి రైతు వేదికలో కాంగ్రెస్ బూత్  లెవెల్ ఏజెంట్లకు, ముఖ్య నాయకులకు ఎస్ఐఆర్ పై బుధవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఎమ్మెల్యే తో పాటు డిసిసి అధ్యక్షురాలు ఉమామురళి నాయక్ హాజరయ్యారు. ఎస్ ఐ ఆర్, ఓటర్ నమోదుపై ఎమ్మెల్యే కీలక మార్గదర్శకాలను అందించారు. డిసిసి ప్రెసిడెంట్ ఉమా మురళీ నాయక్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమ పథకాలను ప్రతి ఇంటా ప్రచారం చేస్తూ, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ పార్టీ విజయానికి సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో స్థానిక సర్పంచి తమ్మడపల్లి కుమార్,పార్టీ మండల అధ్యక్షులు కూరెల్లి సతీష్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు అజ్మీర సురేష్ నాయక్,ముఖ్య నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు,ఉపసర్పంచులు,వార్డు మెంబర్లు,ఇందిరమ్మ కమిటీ సభ్యులు, మాజీ ఎంపీటీసీలు, వివిధ గ్రామాల పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

🕒 25 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/booth-level-agents-are-the-backbone-of-congress-party/article-17165

Tags: