మాదకద్రవ్యాలకు నో... లక్ష్యాలకు యెస్ చెప్పండి
- రేపటి భవిష్యత్తుకు మార్గదర్శకాలు మిరే: జిల్లా ఎస్పీ డా. శబరీష్
విశ్వంభర, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలోని జడ్పీ హైస్కూల్‌లో నిర్వహించిన "మన ఊరు – మన బాధ్యత" కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డా. శబరీష్ పాల్గొని విద్యార్థులకు గంజాయి,ఇతర మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో 9వ, 10వ తరగతి విద్యార్థులతో పాటు ఇంటర్మీడియట్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విద్యార్థులను ఉద్దేశించి ఎస్పీ మాట్లాడుతూ, గంజాయి వంటి మాదకద్రవ్యాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తాయని, ఒక్కసారి వాటికి బానిసైతే చదువు, ఆరోగ్యం, కుటుంబ జీవితం తీవ్రంగా దెబ్బతింటాయని అన్నారు. విద్యార్థి దశలో లక్ష్యాలపై దృష్టి సారించి కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గర్వపడేలా మంచి పేరు తీసుకురావాలని, చెడు స్నేహాలు, చెడు అలవాట్లు మరియు మాదకద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. నేటి విద్యార్థులే రేపటి దేశ భవిష్యత్తని, ప్రతి ఒక్కరూ తమ జీవిత లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. మాదకద్రవ్యాలకు నో... లక్ష్యాలకు యెస్ అనే సందేశాన్ని ప్రతి విద్యార్థి తమ జీవితంలో ఆచరణలో పెట్టాలని కోరారు. అనంతరం గంజాయి వ్యతిరేక సందేశాలతో రూపొందించిన పోస్టర్లను ఎస్పీ ఆవిష్కరించి విద్యార్థులతో కలిసి ప్రదర్శించారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలను సమాజానికి తెలియజేయడంలో యువత ముందుండాలని సూచించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో విద్యార్థులందరితో కలిసి ఎస్పీ ప్రతిజ్ఞ చేయించారు. గంజాయి,ఇతర మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని, తమ తోటి విద్యార్థులను కూడా చెడు అలవాట్ల బారిన పడకుండా చైతన్యవంతులను చేస్తామని ప్రతిజ్ఞ చేస్తూ విద్యార్థులు వాల్ ఆఫ్ ప్రామిస్‌పై సంతకాలు చేశారు. వందలాది మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని గంజాయి రహిత సమాజ నిర్మాణానికి తమ మద్దతు ప్రకటించారు. యువతలో చైతన్యం పెంపొందించడం ద్వారా మాత్రమే మాదకద్రవ్యాల నిర్మూలన సాధ్యమవుతుందని ఎస్పీ పేర్కొన్నారు. గంజాయి నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ, ఈగల్ ఫోర్స్ చేపడుతున్న కార్యక్రమాలకు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సహకరించాలని కోరారు.