దళితవాడల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలి: సిర్పంగి స్వామి

విశ్వంభర, వలిగొండ: దళితవాడల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని, ఇందిరమ్మ ఇళ్ల దళిత లబ్ధిదారులకు అదనంగా రూ.5 లక్షలు మంజూరు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సిర్పంగి స్వామి డిమాండ్ చేశారు. గురువారం వలిగొండ మండల కేంద్రం, దాసిరెడ్డిగూడెంలో "దళితవాడల సర్వే–సమస్యలపై పోరుబాట" కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచినా దళితవాడల పరిస్థితిలో ఆశించిన మార్పులు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులకు 55 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్ ఇవ్వాలని, అన్ని దళితవాడల్లో వాటర్ ఫిల్టర్లు ఏర్పాటు చేయాలని కోరారు. వలిగొండ ఎస్సీ కాలనీలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ సమస్యను పరిష్కరించడంతో పాటు, దాసిరెడ్డిగూడెంలో కమ్యూనిటీ హాల్ మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు, దళిత కాలనీ ప్రజలు పాల్గొన్నారు.

🕒 26 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/sirpangi-swamy-should-allocate-special-funds-for-the-development-of/article-17242

Tags: