మాజీ సర్పంచ్ పిట్టల సంపత్ చేపట్టిన పనులపై విచారణ నివేదిక

  • పనుల బిల్లులపై డీఎల్పీఓ వెంకటేశ్వర్లు స్పష్టీకరణ

విశ్వంభర,   హుస్నాబాద్ : హుస్నాబాద్ మండలం మహమ్మదాపూర్ గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ పిట్టల సంపత్ తన పదవీకాలంలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపుల విషయమై జిల్లా స్థానిక పంచాయతీ అధికారి (డీఎల్పీఓ) వెంకటేశ్వర్లు వివరణ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్వహించిన విచారణలో మహమ్మదాపూర్ గ్రామపంచాయతీలో మొత్తం ఆరు అభివృద్ధి పనులు చేపట్టినట్లు గుర్తించారు. వాటిలో గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక, ఫైనాన్స్ కమిషన్ నిధుల కింద ఆమోదం పొందిన మూడు పనుల అంచనా వ్యయం రూ.2,56,475 కాగా, వాటికి ఇప్పటివరకు రూ.1,64,205 చెల్లించబడినట్లు తెలిపారు. మిగిలిన రూ.92,270 బకాయి ఉందని పేర్కొన్నారు. అలాగే మరో మూడు పనులు గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళికలో పొందుపరచబడకపోవడం, సంబంధిత తీర్మానాలు మరియు అనుమతులు లేకపోవడం వల్ల వాటి బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు వెల్లడించారు. ఆ పనుల అంచనా వ్యయం రూ.3,37,268గా ఉందన్నారు. ఈ పనులకు సంబంధించిన చెల్లింపులు ప్రస్తుతం నిబంధనల కారణంగా నిలిచిపోయాయని, భవిష్యత్తులో గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళికలో చేర్చి, అవసరమైన అనుమతులు పొందిన అనంతరం చెల్లింపులు జరిపేందుకు చర్యలు తీసుకుంటామని డీఎల్పీఓ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే బిల్లుల చెల్లింపులు జరుగుతాయని, ఈ అంశంపై పూర్తి నివేదికను జిల్లా కలెక్టర్‌కు సమర్పించినట్లు ఆయన పేర్కొన్నారు.

🕒 25 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/inquiry-report-on-works-undertaken-by-former-sarpanch-pittala-sampath/article-17199

Tags: