వచ్చే ఏడాది నుంచి విద్యార్థులకు అల్ఫాహారం

వచ్చే ఏడాది నుంచి విద్యార్థులకు అల్ఫాహారం

  • 2026 - 27 నుంచి అమలుకు రూ.400కోట్లు 
  • ఫ్రీప్రైమరీ నుంచి ఇంటర్ వరకు అమలు : కె.ఎల్ .ఆర్
  • పేద విద్యార్థులకు కడుపునిండా టిఫిన్, మధ్యాహ్న భోజనం

 

 

విశ్వంభర, మహేశ్వరం :  వచ్చే విద్యా సంవత్సవరం నుండి ఫ్రీమైమరీ నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థుల వరకు ఉదయం అల్ఫాహారం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి తెలియజేశారు,
దీనివల్ల మహేశ్వరం నియోజకవర్గంలోని వేలాది మంది పేద, మధ్య తరగతి విద్యార్థులకు కడుపునిండా ఉదయం అల్ఫాహారం, మధ్యాహ్న భోజనం అందుతుందని కెఎల్ ఆర్  తెలిపారు. కందుకూరు మండలం 54, మహేశ్వరం మండలం 54, బాలాపూర్ మండలంలో 38 పాఠశాలతోపాటు 3 ఇంటర్మీడియట్ కాలేజీలు ఉన్నాయి. ఆర్కేపురం, సరూర్ నగర్ డివిజన్లల్లో ఉన్న బడుల్లో చదివే పేద విద్యార్థులకు మంచి పౌష్ఠికాహారం అందనుందని మాజీ లెక్చరర్ కేఎల్ఆర్ హర్షం వ్యక్తం చేశారు. పాలు, రాగి జావా, ఉప్మా, వెజ్ బిర్యానీ, కిచ్చిడీ, పులిహోరా, పూరీలు రోజూ ఒక ఐటెంను వడ్డించాలని ప్రభుత్వం నిర్ణయించిందని కిచ్చెన్న తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 25వేల పాఠశాలల్లో దాదాపు 18 లక్షల మంది విద్యార్థుల కోసం రూ.400 కోట్లు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి  నాయకత్వంలో ఖర్చు చేయనున్నట్లు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి తెలియజేశారు. ఇప్పటికే మధ్యాహ్న భోజన పథకానికి రూ.360 ఖర్చు చేస్తుందని గుర్తు చేశారు. కే ఎల్ ఆర్ ట్రస్ట్ ద్వారా బడుగు, బలహీన వర్గాలకు లీడ్ ఇండియా ప్రోగ్రాం ద్వారా ఇప్పటికే లక్షలాది మంది పేద విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందిస్తుంది. ప్రభుత్వానికి సైతం విద్యార్థుల ఇబ్బందులను నివేదిక రూపంలో లీడ్ ఇండియా టీం  అందజేస్తుంది కేఎల్ఆర్ తెలియజేశారు.

Tags: