రోడ్ల సమస్యల పరిష్కారం అయ్యేంతవరకు పోరాటం దీక్ష కొనసాగుతుంది 

విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం మండలంలోని గ్రామాల రోడ్ల దుస్థితిపై కొనసాగుతున్న నిరసన దీక్ష మూడవ రోజున కూడా ఉత్సాహంగా కొనసాగింది. గ్రామాల అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన పాలకుల వైఖరిని దీక్షా శిబిరంలో నాయకులు తీవ్రంగా ఖండించారు,ఏళ్లుగా రోడ్ల సమస్యలు కొనసాగుతున్నప్పటికీ ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గ్రామ ప్రజల సహకారంతో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. మహేశ్వరం మండల ప్రజలు నేడు ఒక ప్రశ్న అడుగుతున్నారు, ఎన్నో సంవత్సరాలుగా మా మహేశ్వరం గడ్డకు వలసవచ్చి మా ప్రజలను మభ్యపెట్టి మా ఓట్ల ద్వారా గెలిచి, మా గ్రామాల సమస్యలు, మా రోడ్లు అధ్వాన్నంగా మారుతున్నా, మా సమస్యలు ఎందుకు పరిష్కారం కావడం లేదు. ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే  సబితా ఇంద్రారెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే కి చ్చన్న గారి లక్ష్మారెడ్డి  ప్రజల ఇబ్బందులను గుర్తించి తగిన చర్యలు తీసుకుని ఉంటే, నేడు ఈ పరిస్థితి వచ్చేదా. ప్రజలు అభివృద్ధి కోసం ఓటు వేశారు, కానీ నేడు గ్రామాల్లో రోడ్లు గుంతలమయంగా మారాయి. వర్షం వస్తే ప్రయాణం కష్టంగా మారుతోంది. రైతులు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మా ప్రశ్న వ్యక్తిగతం కాదు, ప్రజా సమస్యలకు సంబంధించినది. మహేశ్వరం మండల అభివృద్ధి కోసం కేటాయించిన నిధులు ఎక్కడ ఖర్చయ్యాయి. రోడ్ల నిర్మాణానికి తీసుకున్న చర్యలు ఏమిటి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత సబితా ఇంద్రారెడ్డి, కె.ఎల్.ఆర్  గారిదే. అదేవిదంగా ఖర్చు పెట్టిన నిధులకి శ్వేత పత్రం విడుదల చేయాలి, లేని యెడల స్థానిక  ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తక్షణమే రాజీనామా చేయాలని డిమాడ్ చేసారు. మేము ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించడం లేదు, కానీ ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ప్రశ్నించడం మా హక్కు, మహేశ్వరం మండలంలోని ప్రతి గ్రామానికి మంచి రోడ్లు నిర్మించే వరకు మా పోరాటం కొనసాగుతుంది అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జాతీయ కిసాన్ మోర్చా నాయకులు పాపయ్య గౌడ్ , జిల్లా ప్రధాన కార్యదర్శి దేవేందర్ రెడ్డి, జిల్లా చేవెళ్ల పార్లమెంట్ కోకన్వీనర్ కాసుల అనంత్తయ్య గౌడ్ , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కడారి జంగయ్య యాదవ్ , రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యదర్శి కుండే వెంకటేష్ ,గిరిజన మోర్చా రాష్ట్ర కార్యదర్శి పాండు నాయక్, రాష్ట్ర నాయకులు దేశ్య నాయక్, రాష్ట్ర గిరిజ మోర్చా కార్యవర్గ సభ్యులు పంత్తు నాయక్, జిల్లా కౌన్సిల్ మెంబెర్ మాధవ చారి , మాజీ జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి పోతర్ల సుదర్శన్ యాదవ్, జిల్లా కార్యదర్శి ఆఇళ్ల యాదయ్య గౌడ్, ప్రధాన కార్యదర్శులు వనంపల్లి శ్రవణ్, ఉపేందర్, మండల మీడియా కన్వీనర్ మోతే యాదయ్య, మండల ఉపాధ్యకుడు చెన్నరెడ్డి, రూప్ సింగ్, బండ బిక్షపతి, మండల కార్యదర్శి బొమ్మ దేవేందర్, పోల్కం మహేందర్, మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు ఎర్ర పాండు, మండల ఎస్సీ మోర్చా అధ్యక్షులు గోల్లూరు మాధవ్, మండల ఎస్టీ మోర్చా అధ్యక్షులు కృష్ణ నాయక్, బిజెపి సీనియర్ నాయకులు శ్రీధదర్ రెడ్డి, సర్పంచ్ యాదయ్య, శక్తి కేంద్ర ఇన్చార్జిలు, బూత్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

🕒 25 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/the-struggle-will-continue-until-the-road-issues-are-resolved/article-17154

Tags: