అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి 

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి 


  • అధికారులతో సీఎంసీ సృజన 

విశ్వంభర,  శేరిలింగంపల్లి:  జోనల్ కార్యాలయంలో బుధవారం సైబరాబాద్ మున్సిపల్  కమిషనర్ జి. సృజన అధ్యక్షతన జోనల్ స్థాయి  సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జోనల్ కమిషనర్ నారాయన్ అమిత్, ఐఏఎస్ ,ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, శానిటేషన్   ప్రధానాధికారులు పాల్గొన్నారు. సమావేశంలో విభాగాల మధ్య సమన్వయం మెరుగుపరచడం అత్యంత అవసరమని కమిషనర్ సృజన  పేర్కొన్నారు. అంతర్గత సమన్వయం లోపించకుండా చర్యలు తీసుకోవడం ద్వారా పనుల్లో జాప్యాన్ని నివారించాలని ఆదేశించారు. ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని, నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ సమర్థవంతంగా చేయాలని, ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని సూచించారు.అదేవిధంగా, వార్షిక లక్ష్యాలను చేరుకోవడానికి ప్రతి విభాగం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని, క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని డ్రైనేజీ పనులు, రోడ్ల మరమ్మతులు మరియు ఇతర అత్యవసర చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని చర్చించారు.ఈ సమావేశంలో  ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, శానిటేషన్ మరియు ఇతర విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Tags: