ఇనుగుర్తి లోవాలీబాల్ శిక్షణ శిబిరం ప్రారంభం
- వాలీబాల్ క్రీడకు పూర్వవైభవం తీసుకురావాలి
- భారత మాజీ కెప్టెన్ వెంకటనారాయణ
విశ్వంభర, ఇనుగుర్తి: వాలీబాల్ క్రీడకు పూర్వ వైభవం తీసుకురావాలని వాలీబాల్ క్రీడా దిగ్గజం, భారత మాజీ కెప్టెన్ కన్నా వెంకటనారాయణ ఆకాంక్షించారు. మండల కేంద్రం ఇనుగుర్తి జడ్పీహెచ్ఎస్ లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ, జిల్లా యువజన , క్రీడా శాఖ, ఇనుగుర్తి వాలీబాల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో వేసవి సెలవులు పురస్కరించుకుని విద్యార్థులు, యువకులకు వాలీబాల్ ప్రత్యేక శిక్షణ శిబిరం బుధవారం ఎస్సై కరుణాకర్, స్థానిక సర్పంచి తమ్మడపల్లి కుమార్, కోచ్ సట్ల బిక్షం ప్రభృతులతో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాలీబాల్ క్రీడలో దేశంలోనే ఇనుగుర్తి ప్రఖ్యాతి తరించుకున్నదన్నారు.వందల మంది వాలీబాల్ పట్ల ఆసక్తి కనపరచి దిగ్గజాలుగా ఎదిగారన్నారు.ఎంతోమందికి క్రీడ ఉపాధి అవకాశాలు కల్పించిందని చెప్పారు. ఏకాగ్రతతో చదువుకుంటూనే వాలీబాల్ క్రీడలో రాణించాలని సూచించారు. ఈ మేరకు వేసవి శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో దిశ సభ్యులు బాబురావు,రిటైర్డ్ టీచర్ సీనియర్ క్రీడాకారులు కన్న సాంబయ్య,కందునూరి వెంకన్న,తాళ్లపెల్లి సతీష్,మామిడి అశోక్,పరుపాటి రాజేందర్, చెడుపాక రవి,పిడి ప్రణయ్,సమ్మర్ క్యాంప్ కోచ్ కూటికంటి ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.



