అక్రమ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలపై కేసులు
విశ్వంభర, జీహెచ్‌ఎంసీ: ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీల నియంత్రణ చట్టం-2005 నిబంధనలను ఉల్లంఘిస్తూ, చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేకుండా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఏడు ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలపై కరీంనగర్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ ఓఎస్‌డీ వి.బి. కమలాసన్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించిన తనిఖీల్లో ఈ అక్రమ కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. సంబంధిత ఏజెన్సీలకు ముందుగా షోకాజ్ నోటీసులు జారీ చేసినప్పటికీ సంతృప్తికరమైన వివరణ ఇవ్వకపోవడంతో, కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో బీఎన్‌ఎస్ సెక్షన్ 318(4)తో పాటు ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీల నియంత్రణ చట్టంలోని సెక్షన్ 20, 22 కింద ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఓఎస్‌డీ కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా అక్రమ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు. లైసెన్స్ లేకుండా ఏజెన్సీలు నిర్వహించడం చట్టవిరుద్ధమని, నిబంధనలు ఉల్లంఘించిన వారికి జైలు శిక్ష లేదా జరిమానా విధించే అవకాశం ఉందని హెచ్చరించారు. వ్యాపార, పారిశ్రామిక సంస్థలు ప్రభుత్వం గుర్తింపు పొందిన, చెల్లుబాటు అయ్యే లైసెన్స్ కలిగిన ఏజెన్సీల నుంచే భద్రతా సేవలను పొందాలని సూచించారు.