కరీంనగర్‌లో ఎఐటియుసి రాష్ట్ర మహాసభలు

కరీంనగర్‌లో ఎఐటియుసి రాష్ట్ర మహాసభలు

విశ్వంభర, కరీంనగర్‌ : కరీంనగర్‌లో జరిగే ఎఐటియుసి 4వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాదు హిమాయత్ నగర్ లో ఆహ్వాన సంఘం ఏర్పాటు సమావేశంలో చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, కార్మిక హక్కుల పరిరక్షణలో ఎఐటియుసి కీలక పాత్ర పోషిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వ లేబర్ కోడ్‌లతో కార్మికులకు అన్యాయం జరుగుతోందని విమర్శించారు. సమావేశంలో వి.యస్.బోస్, కలవేణి శంకర్, వాసిరెడ్డి సీతారామయ్య, యం.డి.యూసుఫ్, ఎస్.బాల్‌రాజ్, వెలిశల రాజేందర్ రావు, వి.నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఆహ్వాన సంఘం అధ్యక్షుడిగా పంజాల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా టేకుమల్ల సమ్మయ్య, కోశాధికారిగా కటికరెడ్డి బుచ్చన్న యాదవ్ ఎన్నికయ్యారు. సెప్టెంబర్ 6 నుంచి 8 వరకు మూడు రోజుల పాటు మహాసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సుమారు 650 మంది ప్రతినిధులు పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో యం.నర్సింహ్మా, బి.వెంకటేశం, నండూరి కరుణ కుమారి, కడారి సునీల్, శనిగరపు చంద్రశేఖర్, కడారి రాములు, బి.వెంకటరాజం, మారగోని ప్రవీణ్ కుమార్ గౌడ్, టి.సమ్మయ్య, కొక్కుల శాంత తదితరులు పాల్గొన్నారు.

Tags: