డ్రగ్స్ సరఫరా కీలక నిందితుడి అరెస్టు

డ్రగ్స్ సరఫరా కీలక నిందితుడి అరెస్టు

  •  పలు కేసుల్లో తప్పించుక తిరుగుతున్న క్రిమినల్‌తో  పాటు మరో ముగ్గురి అరెస్టు 
  •  4.62 గ్రాముల ఎండిఎంఎ డ్రగ్స్ స్వాధీనం

విశ్వంభర, జిహెచ్ఎంసి : డ్రగ్స్ కు అలవాటు పడి కారునడుపుతు రోడ్డు ప్రమాదంలో కుడి  చేయి పోగొట్టుకున్నాడు. ఐనా తనలో మార్పురాని  షైక్  ఫైసల్ డ్రగ్స్ అమ్మకాల్లో క్రిమినల్ గా చెలామణి అవుతున్నాడు.ఇప్పటికే మూడు కేసుల్లో తప్పించుక తిరుగుతున్నాడు. శుక్రవారం తెల్లవారు జామున ఎక్సైజ్ ఎస్టీఎఫ్ టీమ్ ఎస్సై సంధ్యా సిబ్బందికి  ఎండిఎంఎ డ్రగ్స్ అమ్మకాలు జరుపుతూ ప్రధాన నిందితుడు షేక్  ఫైసల్ మరో ముగ్గురు పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళితే.. ట్రబ్‌నగర్ అంబర్‌పేట్ ప్రాంతంలో డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు ఎక్సైజ్ ఎస్టీఎఫ్ బీ టీమ్ ఎస్సై  సంధ్యా సిబ్బంది కలిసి తనిఖీలు నిర్వహించారు.కారులో అనుమానితులుగా ఉన్న నలుగురిని తనిఖీలు చేశారు. వారివద్ద ఉన్న 4.62 గ్రాముల ఎండిఎంఎ డ్రగ్స్‌ను స్వాధీనం చేసు  కున్నారు. డ్రగ్స్‌తో పాటు కారును మూడు సెల్‌ఫోన్లను సీజ్ చేశారు. ఈ నలుగురు నిందిగతుల్లో షేక్ ఫైసల్, పి. అన్షు ప్రసాద్,  ఎండి. మసూద్, ఏ. ప్రీతి వర్ధన్‌లను అరెస్టు చేశారు. పట్టుబడిన  నిందితులు బెంగూళూరు  నుంచి 20 గ్రాముల ఎండీఎంఎ తీసుక  వచ్చి అమ్మకాలు జరుపు తుండగా ఎస్టీఎఫ్ టీమ్ పట్టుకున్నారు.ఈ విచారణలో షేక్ ఫైసల్ అనే వ్యక్తి చాల కాలంగా డ్రగ్స్‌ను సేవించడంతో పాటు పెద్ద మొత్తంలో అమ్మకాలు చేపడుతున్నట్లు,  ఇప్పటికే పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. నిందితులను, డ్రగ్స్‌ను, కారును, సెల్ ఫోన్లను కాచిగూడ ఎక్సైజ్   స్టేషన్‌లో అప్పగించినట్లు సీఐ, టీమ్ లీడర్ బిక్షారెడ్డి, ప్రదీప్‌రావులు  తెలిపారు.

🕒 09 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/drug-supply-key-suspect-arrested/article-15087

Tags: