అభివృద్ధి పనులు పరిశీలించిన మిర్యాలగూడ చైర్ పర్సన్ చిలుకూరి సుధా బాలకృష్ణ

 విశ్వంభర, మిర్యాలగూడ : మిర్యాలగూడ పట్టణ అభివృద్ధిలో భాగంగా   మున్సిపల్ చైర్‌పర్సన్ చిలుకూరి సుధా బాలకృష్ణ  27వ, 40వ వార్డుల్లో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కుమారి నర్రా శ్రీజా రెడ్డి, 27వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి గొట్టిముక్కల ఝాన్సీ లక్ష్మణ్ , జవాన్లు, వార్డు అధికారులు, మున్సిపల్ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి కాలనీలలోని సమస్యలను పరిశీలించారు. డ్రైనేజీ వ్యవస్థ, పారిశుధ్య నిర్వహణ, చెత్త సేకరణ, రోడ్ల పరిస్థితి, వర్షాకాలంలో నీరు నిలిచే ప్రాంతాలు, కాలనీల పరిశుభ్రత మరియు ప్రజలకు అవసరమైన మౌలిక వసతులపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వెంటనే సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.ప్రతి వార్డును పరిశుభ్రంగా, అభివృద్ధి చెందిన ప్రాంతంగా తీర్చిదిద్దేందుకుమున్సిపాలిటీ కట్టుబడి పనిచేస్తుందని మున్సిపల్ చైర్‌పర్సన్  తెలిపారు. ప్రజలసమస్యలను నేరుగా తెలుసుకుని వేగంగా పరిష్కరించడమే తమ ప్రధాన లక్ష్యమనిపేర్కొన్నారు.

🕒 25 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/miryalaguda-chairperson-chilukuri-sudha-balakrishna-inspected-the-development-works/article-17151

Tags: