వస్తాకొండూర్ ప్రభుత్వ పాఠశాలలకు రూ.1.50 లక్షల విలువైన డ్యూయల్ డెస్క్ బెంచీల విరాళం

విశ్వంభర, గుండాల:  గుండాల మండలం వస్తాకొండూర్ గ్రామానికి చెందిన పాఠశాల పూర్వ విద్యార్థి, గ్రామ వాస్తవ్యుడు చల్లా కృష్ణమూర్తి తన గ్రామ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి మరోసారి ఉదారత చాటుకున్నారు. గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం సుమారు రూ.1.50 లక్షల విలువైన 25 డ్యూయల్ డెస్క్ బెంచీలను విరాళంగా అందజేశారు. తన గ్రామ పాఠశాలల పట్ల ఉన్న అభిమానం, విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే సంకల్పంతో ఈ విరాళాన్ని అందించినట్లు చల్లా కృష్ణమూర్తి తెలిపారు. ఈ బెంచీలు విద్యార్థుల విద్యాభ్యాసానికి ఎంతో ఉపయోగపడతాయని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నర్సిరెడ్డి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు జంపాల రాజు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, గ్రామ సర్పంచ్ లింగాల అనిల్ కుమార్, ఉప సర్పంచ్ పరుశరాములు, గ్రామ పెద్దలు తదితరులు చల్లా కృష్ణమూర్తికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా, ఇరు పాఠశాలల విద్యార్థులకు త్వరలోనే ఆకర్షణీయమైన స్పోర్ట్స్ యూనిఫాంలు, టైలు, బెల్టులు, షూలను కూడా అందజేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు ప్రత్యేక పిలుపునిచ్చిన చల్లా కృష్ణమూర్తి, తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు ఇంగ్లీష్ మీడియం బోధన అందుబాటులో ఉందని, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు విద్యాబోధన చేస్తున్నారని తెలిపారు. కేవలం ఆకర్షణల కోసం ప్రైవేట్ పాఠశాలలను ఆశ్రయించి ఆర్థిక భారం మోసుకోవద్దని, ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్యతో పాటు ప్రభుత్వం కల్పిస్తున్న పలు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

🕒 25 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/donation-of-dual-desk-benches-worth-rs-150-lakh-to/article-17102

Tags: