అక్రమ నిర్మాణాల స్వాధీనం
విశ్వంభర, కర్మన్ ఘట్: ప్రసిద్ధి చెందిన శ్రీ కర్మన్ ఘాట్ హనుమాన్ దేవస్థానమునకు దత్తత దేవాలయంగా ఉన్న బాన్సురివాల క్రిష్ణ మందిరానికి సంబంధించి సైదాబాద్ గ్రామము సర్వె నెం.110లో ఉన్న భూమిలో అక్రమంగా నిర్మాణము చేపట్టిన ఇండ్ల ను తొలగించాలని దేవాదాయ ట్రిబ్యునల్ ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉత్తర్వులను అనుసరించి ఇండ్లు ఖాళీ చేసి దేవస్థానమునకు అప్పగించవలసినదిగా ఇచ్చిన ఉత్తర్వుల గడువు ముగియడంతో అక్రమ నిర్మాణాలను దేవాదాయ శాఖ హైదరాభాదు జిల్లా సహాయ కమీషనరు టి. శేఖర్ పర్యవేక్షణలో, పోలీసు బందోబస్తుతో, కార్యనిర్వహణాధికారి యన్. లావణ్య, ఆలయ చైర్మన్ ఈదులకంటి సత్యనారాయణ, ధర్మకర్తలు దిండు ప్రవీణ్ గౌడ్, తోకటి కిరణ్ కుమార్, సింగంశెట్టి శ్రీనివాస్, జనుంపల్లి విష్ణువర్ధన్ రెడ్డి, నారాయణ్ దుర్గా రెడ్డి, కుకునూరి గోపాల్ రెడ్డి, పూల నాగరాజు, కె. కవిత, ఓరుగంటి నరేష్, కొండ్ర సంతోష్ కుమార్, బండిగారి శ్రీనివాస్ గౌడ్, యం. రాజేశ్వరి దేవాదాయ శాఖ ఇతర దేవాలయముల కార్యనిర్వహణాధికారులు, సహాయ కమీషనరు కార్యాలయ ఇనిస్పెక్టర్లు, కార్యాలయ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.



