మేడారం భక్తులకు వాసవి క్లబ్ భద్రాచలం సేవా హస్తం – 600 వాటర్ బాటిళ్ల పంపిణీ
విశ్వంభర,భద్రాచలం:-మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరకు తరలివెళ్లే లక్షలాది భక్తుల సౌకర్యార్థం వాసవి క్లబ్ భద్రాచలం ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా భద్రాచలం బస్టాండ్ వద్ద మేడారం భక్తులకు 600 వాటర్ బాటిళ్లను పంపిణీ చేసి, దాహార్తిని తీర్చే విధంగా సేవలందించారు. భక్తుల ఆరోగ్యం, సౌకర్యాలే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని డిఎం గారి సమక్షంలో, V106A గవర్నర్ ప్రోగ్రామ్ గోల్డెన్ శ్రీ చారుగుళ్ల శ్రీనివాస్ గారి ఆర్థిక సహకారంతో వారి చేతుల మీదుగా ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వాసవి క్లబ్ సభ్యులు మాట్లాడుతూ, మేడారం జాతర అనేది గిరిజన సంస్కృతి, ఆధ్యాత్మికతకు ప్రతీక అని, ఈ మహాజాతరకు వెళ్లే భక్తులకు కనీస అవసరాలు అందించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని తెలిపారు. ముఖ్యంగా ప్రయాణ సమయంలో తాగునీటి అవసరం అధికంగా ఉండటంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని పేర్కొన్నారు. వాసవి క్లబ్ భద్రాచలం నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, పేదలు, భక్తులు, అవసరంలో ఉన్నవారికి తోడుగా నిలుస్తోందని వారు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో ఆర్‌సి సిల్వర్ కెసిజిఎఫ్ బండారు కృష్ణయ్య గారు, జెడ్‌సి కెసిజిఎఫ్ బచ్చు సాగర్ గారు, భద్రాచలం వాసవి క్లబ్ అధ్యక్షులు కెసిజిఎఫ్ వనమా కిరణ్ కుమార్ గారు, రేపాక హరి గారు తదితర ప్రముఖులు పాల్గొని సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమం సందర్భంగా పలువురు భక్తులు వాసవి క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని జరగాలని ఆకాంక్షించారు. మేడారం జాతర నేపథ్యంలో వాసవి క్లబ్ భద్రాచలం చేపట్టిన ఈ మానవతా సేవ ప్రజల మనసులను ఆకట్టుకుంటూ, సమాజానికి ఆదర్శంగా నిలిచిందని పలువురు అభిప్రాయపడ్డారు.



