రష్యాలో వాట్సాప్‌పై పూర్తి నిషేధం

రష్యాలో వాట్సాప్‌పై పూర్తి నిషేధం

రష్యా ప్రభుత్వం ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు ఊహించని షాక్ ఇచ్చింది. స్థానిక చట్టాలను, ప్రభుత్వ నిబంధనలను పాటించడంలో విఫలమైందనే కారణంతో వాట్సాప్‌ను దేశవ్యాప్తంగా పూర్తిగా బ్లాక్ చేసినట్లు రష్యా ప్రభుత్వ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ అధికారికంగా ప్రకటించారు. 

విశ్వంభర, నేషనల్ బ్యూరో: రష్యా ప్రభుత్వం ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు ఊహించని షాక్ ఇచ్చింది. స్థానిక చట్టాలను, ప్రభుత్వ నిబంధనలను పాటించడంలో విఫలమైందనే కారణంతో వాట్సాప్‌ను దేశవ్యాప్తంగా పూర్తిగా బ్లాక్ చేసినట్లు రష్యా ప్రభుత్వ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ అధికారికంగా ప్రకటించారు. రష్యా ప్రభుత్వం విధించిన కఠినమైన నిబంధనలను పాటించడానికి వాట్సాప్ నిరాకరించిందని అధికారులు ఆరోపిస్తున్నారు. నేరాలను అరికట్టేందుకు అవసరమైన వినియోగదారుల సమాచారాన్ని భద్రతా సంస్థలతో పంచుకోవాలని రష్యా కోరినప్పటికీ, వాట్సాప్ అందుకు అంగీకరించలేదు. ప్రభుత్వ నిఘాకు లోబడి పనిచేయని యాప్‌లను రష్యా తన దేశంలో అనుమతించడం లేదు.

వాట్సాప్ నిషేధంతో, రష్యా ప్రభుత్వం తన సొంత యాప్ ‘మ్యాక్స్’ను ప్రోత్సహిస్తోంది. చైనాలోని ‘వీచాట్’ మాదిరిగానే, ఈ సూపర్ యాప్ మెసేజింగ్‌తో పాటు బ్యాంకింగ్, ప్రభుత్వ సేవలను ఒకే వేదికపై అందించనుంది. 

Read More ట్రంప్–మోదీ మధ్య దూరం సహజమే: అమెరికా రాయబారి

రష్యా ప్రభుత్వ నిర్ణయాన్ని వాట్సాప్ తీవ్రంగా ఖండించింది. 10 కోట్ల మంది వినియోగదారులను సురక్షితమైన కమ్యూనికేషన్‌కు దూరం చేసి, వారిని ప్రభుత్వ నిఘా ఉండే యాప్ వైపు మళ్లించే ప్రయత్నమిదని వాట్సాప్ ఆరోపించింది. తన పౌరుల డిజిటల్ కమ్యూనికేషన్‌పై పూర్తి నియంత్రణ సాధించాలనే ఉద్దేశంతోనే వాట్సాప్‌ను నిలిపివేసి, ప్రభుత్వ యాప్‌ను తప్పనిసరి చేస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. వాట్సాప్‌తో పాటు టెలిగ్రామ్ సేవలను కూడా రష్యా పరిమితం చేసింది. ఇప్పటికే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లపై రష్యాలో ఆంక్షలు ఉన్నాయి.

 

Related Posts