ఏపీలో జాతీయ ఆయుర్వేద వైద్య సంస్థ

ఏపీలో జాతీయ ఆయుర్వేద వైద్య సంస్థ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే ఆయుష్ వైద్యానికి హబ్ గా మార్చే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ప్రాచీన వైద్య విధానాలను ఆధునిక చికిత్సలతో అనుసంధానించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ధ్యేయంగా భారీ ప్రాజెక్టులను రూపొందించింది.

విశ్వంభర, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే ఆయుష్ వైద్యానికి హబ్ గా మార్చే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ప్రాచీన వైద్య విధానాలను ఆధునిక చికిత్సలతో అనుసంధానించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ధ్యేయంగా భారీ ప్రాజెక్టులను రూపొందించింది. ఆధ్యాత్మిక నగరం తిరుపతిని 'మెడికల్ హబ్'గా మార్చే ప్రణాళికలో భాగంగా, అక్కడ ఒక ప్రతిష్టాత్మక జాతీయ ఆయుర్వేద సంస్థను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది.

ఇప్పటికే తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ ఆయుర్వేద కళాశాలను జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేయడం, లేదా కేంద్ర నిధులతో కొత్త సంస్థను నిర్మించడంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాజధాని అమరావతిలో, 2026 కేంద్ర బడ్జెట్ కేటాయింపులకు అనుగుణంగా రెండు జాతీయ స్థాయి వైద్య పరిశోధనా సంస్థలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం స్థలాన్ని కేటాయించింది. అమరావతిలో నిర్మించబోయే 'హెల్త్ సిటీ'లో ఈ సంస్థలు అత్యాధునిక వైద్య పరిశోధనలను చేపట్టడంతో పాటు, ఉన్నత వైద్య విద్యను కూడా అందించనున్నాయి.

Read More బాబుకు బిగ్ రిలీఫ్..ఆ కేసు క్లోజ్..!!