గ్రామాలకు కేంద్రం వరాల జల్లు

గ్రామాలకు కేంద్రం వరాల జల్లు

రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఊతమిచ్చింది. 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలలో భాగంగా తాజాగా రూ.387 కోట్లను కేంద్రం విడుదల చేసింది. 

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఊతమిచ్చింది. 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలలో భాగంగా తాజాగా రూ.387 కోట్లను కేంద్రం విడుదల చేసింది. వారం రోజుల క్రితమే తొలి విడతలో రూ.259.36 కోట్లు విడుదల చేసిన కేంద్రం.. ఇప్పుడు రెండో విడత నిధులను మంజూరు చేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆలస్యం కావడంతో నిధుల విడుదల కూడా పెండింగ్‌లో పడింది. తాజా నిధులతో కలిపి మొత్తం రూ.646.46 కోట్లు తెలంగాణకు చేరాయి. ఈ నిధులు గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులకు, మౌలిక సదుపాయాల కల్పనకు ఎంతో ఉపయోగపడనున్నాయి.

మంత్రి సీతక్క విజ్ఞప్తి
నిధుల విడుదలపై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. కేంద్రం కోరిన నిబంధనలన్నీ రాష్ట్ర ప్రభుత్వం పాటించిందని ఆమె పేర్కొన్నారు. అయితే, ఇంకా సుమారు రూ.2400 కోట్ల నిధులు కేంద్రం నుంచి రావాల్సి ఉందని, గ్రామాల రూపురేఖలు మార్చడానికి ఈ పెండింగ్ నిధులను యుద్ధప్రాతిపదికన విడుదల చేయాలని మంత్రి సీతక్క కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

Read More శ్రీ లక్ష్మీ గోశాలకు  5116 విరాళం