సూర్యాపేటలో ట్రాఫిక్ సిగ్నల్స్, సీసీటీవీ కెమెరాల ప్రారంభం
విశ్వంభర, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ నియంత్రణను మెరుగుపరిచేందుకు బస్టాండ్ చౌరస్తా, ఖమ్మం క్రాస్‌రోడ్ చౌరస్తాల్లో అత్యాధునిక ట్రాఫిక్ సిగ్నల్స్‌ను, పట్టణంలోని 9 ప్రధాన కూడళ్లలో 20 ఆటోమేటిక్ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థలను జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, జిల్లా ఎస్పీ కె. నరసింహ మున్సిపల్ చైర్‌పర్సన్ నివేదిత లక్షాదితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెరుగుతున్న వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని శాస్త్రీయ పద్ధతిలో ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సీసీటీవీ కెమెరాలు వాహనాల నంబర్ ప్లేట్లను గుర్తించి సిగ్నల్ జంపింగ్, రాంగ్‌రూట్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్ వంటి ఉల్లంఘనలను గుర్తించి చర్యలు తీసుకునేందుకు ఉపయోగపడతాయని చెప్పారు. ఈ కెమెరాల ద్వారా నమోదయ్యే సమాచారం జిల్లా పోలీసు కమాండ్ కంట్రోల్ రూమ్‌కు నేరుగా అనుసంధానమై ఉంటుందని వివరించారు. ఎస్పీ నరసింహ మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులకు ఆటోమేటిక్‌గా ఈ-చలానాలు జారీ అవుతాయని తెలిపారు. అలాగే ఈ కెమెరాలు ట్రాఫిక్ నియంత్రణతో పాటు నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల పర్యవేక్షణకు కూడా ఉపయోగపడతాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో అవసరాన్ని బట్టి మరిన్ని కూడళ్లలో ఈ వ్యవస్థను విస్తరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్నకుమార్, వైస్ చైర్మన్ షఫీ ఉల్లా, మున్సిపల్ కమిషనర్ హనుమంతరెడ్డి, ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం, కౌన్సిలర్లు, మున్సిపల్ మరియు పోలీసు శాఖ అధికారులు పాల్గొన్నారు.