మునుగోడు - ఐఎన్ టియూసి 327 యూనియన్ మేడే వేడుకలు
On
విశ్వంభర, మునుగోడు :మునుగోడు మండల కేంద్రంలో తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యములో మేడే కార్మిక దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు..మండల కేంద్రంలోని విద్యుత్ కార్యాలయం వద్ద సబ్ డివిజన్ లీడర్ పెరుమాండ్ల నరసింహ ఆధ్వర్యములో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని జెండా ఎగురవేశారు..సమాజ నిర్మాణంలో కార్మికులు పోషిస్తున్న పాత్ర కీలకమైనది అన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ,హక్కుల పరిరక్షణకు ఐఎన్ టియూసి 327 యూనియన్ పనిచేస్తుందని అన్నారు.జిల్లా అధ్యక్షులు సమ్మిరెడ్డి,డివిజన్ సెక్రెటరీ పాండు,స్వామిరెడ్డి,నాగయ్య,జ్యోష్ణ, నర్సింహస్వామి,అనిల్, బిక్షం, మోహన్,వరప్రసాద్ జిల్లా,డివిజన్ ,నాయకులు పాల్గొన్నారు.



